హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ బీచ్‌ రోడ్డులో అరకు కాఫీ కేఫ్‌

విశాఖ బీచ్‌ రోడ్డులో GCC ఆధ్వర్యంలో రూ.1.06 కోట్లతో నిర్మిస్తున్న అరకు వ్యాలీ కాఫీ కేఫ్‌ను GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ మంగళవారం సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో అరకు కాఫీతో పాటు గిరిజన ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.