హైదరాబాద్: 28°C
తెలంగాణ

రుద్రమదేవి మరణ రహస్యాన్ని తెలిపే శాసనం

NLG: వీరనారి రుద్రమదేవి మరణానికి సంబంధించి చందుపట్ల శాసనం కీలక ఆధారంగా నిలుస్తోంది. నకిరేకల్ మండలం చందుపట్లలో లభించిన ఈ శాసనం ప్రకారం రుద్రమదేవి క్రీ.శ. 1289 నవంబర్ 27న పానగల్లు ప్రాంతంలో శివైక్యం పొందినట్లు తెలుస్తోంది. తేదీతో సహా మరణ వివరాలను తెలియజేసే ఈ శాసనానికి కాకతీయ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.