హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి'

RR: ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాపాలన సాధ్యమని ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారంలో ఒక్కసారే కరెంటు మెయింటెనెన్స్ ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర అన్నారు.