హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కనీస వేతనం రూ.42 వేలు ఇవ్వాలి'

KRNL: ఎమ్మిగనూరు మండల సీఐటీయూ కార్యకర్తల సమావేశం శివలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ధరల పెరుగుదలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అంజిబాబు అన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం ఉద్యమించాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.