హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మొక్కలు నాటిన అటవీశాఖ

ASR: అరకులోయలో పర్యాటక వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీశాఖ ఆధ్వర్యంలో మాడగడ, అరకు పైనరీ పర్యాటక ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌వో బి. కోటేశ్వరరావు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకులు, అటవీశాఖ సిబ్బంది, ఎకో టూరిజం సిబ్బంది పాల్గొన్నారు.