సత్యసాయి: సత్యసాయి జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 780 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం తెలిపారు. కోర్టు ద్వారా 27 మందికి జైలు శిక్ష పడగా, సుమారు రూ.68 లక్షల అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా తనిఖీలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రంక్ డ్రైవ్‌పై 780 కేసులు: ఎస్పీ సతీష్


