CTP: గ్రామాల పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు పొడి చెత్తను స్వచ్ఛ రథం ద్వారా సేకరిస్తున్నట్లు జీడీనెల్లూరు ఎంపీడీవో మనోహర్ గౌడ్ తెలిపారు. దసరా సందర్భంగా సాధారణ ధరపై కిలోకు అదనంగా రూ.4 ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. 10 కేజీలకు పైగా పొడి చెత్త అందించే కుటుంబాలకు ఉచిత లక్కీ డిప్ టోకెన్ ఇవ్వనున్నారు. విజేతలకు రైస్ కుక్కర్, డిన్నర్ సెట్, చీర బహుమతులుగా అందజేస్తామని మనోహర్ గౌడ్ తేలిపారు.
ఆంధ్రప్రదేశ్
కిలో చెత్తకు 4 రూపాయలు ప్రోత్సాహకం


