హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు సస్యరక్షణ సూచనలు

NRPT: నారాయణపేట మండలం సింగారంలోని వరి పొలాలను రాష్ట్ర రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆకుమచ్చ తెగులును గుర్తించి, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. అలాగే, యూరియాను సరైన మోతాదులో వినియోగించాలని, పంట ఎదుగుదల దశను బట్టి పోషకాలను అందించాలన్నారు.