ASR: హుకుంపేట మండలం శోభకోట పంచాయతీ సంపంగిపుట్టులో మంగళవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 144 పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దార్ షేక్ ముజీబ్ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ


