హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను కలిసిన పరిటాల శ్రీరామ్

సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను మంగళవారం ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరారు.