హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఓయో రూమ్‌లో యువతి అనుమానాస్పద మృతి

HYD: ఎస్‌ఆర్ నగర్‌లోని గోకుల్ ప్రైడ్ ఓయో రూమ్ 103లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతిచెందింది. గణేష్ పేరుతో లాడ్జ్‌లో దిగిన ఇద్దరిలో తెల్లవారేసరికి యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి ఆధార్‌ కార్డులో దుర్గ అని ఉండగా, గతంలో భర్త కొట్టడంతో చికిత్స పొందిన ఆసుపత్రి రికార్డుల్లో శిరీష అని నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.