దేశంలో సిమెంట్ ధరలు పెంచేందుకు కంపెనీలు మరోసారి సన్నద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో బస్తాపై రూ.5 నుంచి రూ.20 వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ బ్రోకింగ్ నివేదిక తెలిపింది. ఈనెలలో దేశవ్యాప్తంగా బస్తాకు సగటున రూ.7 చొప్పున ధరలు పెరిగాయి. చమురు ధరల పెరుగుదల, రవాణా భారం ఇందుకు ప్రధాన కారణం కాగా.. డిమాండ్, డీలర్ల ఆమోదంపైనే ధరల పెంపు ఆధారపడి ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.
వ్యాపారం
మరోసారి సిమెంట్ ధరల షాక్..!


