దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే ప్రధాన సూచీలు ప్రతికూలతను నమోదు చేశాయి. ఉదయం 9.17 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 214 పాయింట్లు పతనమైంది. అదేవిధంగా జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 60 పాయింట్లు కుంగింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ మార్కెట్లు ఉదయం నుంచే నష్టాలను చవిచూస్తున్నాయి.
వ్యాపారం
నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు


