హైదరాబాద్: 28°C
వ్యాపారం

లిస్టింగ్‌ తప్పించేందుకు టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణ

టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటాసన్స్‌ను లిస్టింగ్ నుంచి తప్పించేందుకు టాటా ట్రస్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని బోర్డుకు ప్రతిపాదించింది. ఈ మేరకు టాటా సన్స్‌లో రెండు ఆపరేటింగ్‌ కంపెనీలను విలీనం చేయాలని భావిస్తోంది. తద్వారా స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ అవసరాన్ని తప్పించాలని చూస్తోంది.