హైదరాబాద్: 28°C
వార్తలు

పల్లెపండుగ 3.0పై సమీక్ష

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ నాయకులతో ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లెపండుగ 3.0 కార్యక్రమానికి ప్రజలను పెద్దఎత్తున సమీకరించడం, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై చర్చించారు.