SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వరాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, వేముల వీరేశంతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి, విప్‌లకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
భీమేశ్వరాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్


