హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడువులోగా పనులు పూర్తి చేయాలి: MLA

SRD: అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చోట్ల నూతన బోర్లు వేయాలని, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.