హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలల్లో ఫుడ్ కమిషన్ తనిఖీలు

ADB: గుడిహత్నూర్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సీతాగొంది ఆదర్శ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, సభ్యుడు ఒరగంటి ఆనంద్ మంగళవారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపాలు, మెనూ అమలులో నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంపై అధికారులను మందలించారు.