హైదరాబాద్: 28°C
తెలంగాణ

PACS మహాజన సభ విజయవంతం

MBNR: నవాబుపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ మహాజన సభ మంగళవారం విజయవంతంగా జరిగింది. ఛైర్మన్‌ మాడెమోని నరసింహులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం ప్రగతి, భవిష్యత్‌ కార్యాచరణ, రైతుల సంక్షేమంపై చర్చించారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంఘం అభివృద్ధికి పలు తీర్మానాలు చేశారు. మాజీ ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లు, సర్పంచులు, రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు.