హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు తొలిసారిగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు

WNP: జిల్లాకు తొలిసారిగా విచ్చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షురాలు అనుజ్ఞా రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఘనపూర్ మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హుస్సేన్ నాయక్ హామీ ఇచ్చారు.