హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కల బెడదపై కమిషనర్‌కు వినతి

NGKL: అచ్చంపేట పట్టణంలో వీధి కుక్కల బెడద పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై కుక్కలు దాడులు చేస్తున్నాయని తెలిపారు. ప్రజల భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.