హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మండలంలో తగ్గిన సాగు విస్తీర్ణం

GDWL: ఎల్ నినో ప్రభావం కారణంగా ఉండవల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ ఏడాది సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ప్రస్తుత సీజన్లో మండలంలోని రైతులు వరి 45, మొక్కజొన్న 765, కందులు 1370, ఎర్ర మిరప 2100, ఉల్లి 725 ఎకరాలలో పంటలను సాగు చేశారు. అత్యధికంగా మండలంలో 11వేల ఎకరాలలో పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో పంటల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.