హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీవారికి వైభవంగా నిత్య కళ్యాణం

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నిత్య పూజలు వైభవంగా జరిగాయి. ఆలయం తెరిచిన అనంతరం అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ, స్వయంభువులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన నిర్వహించారు. అనంతరం సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.