హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర తగ్గుదల

KNR: జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర మంగళవారం స్వల్పంగా తగ్గింది. సోమవారం క్వింటాకు రూ.8,150 పలికిన ధర, మంగళవారం రూ.50 తగ్గి రూ.8,100గా నమోదైంది. మూడు వాహనాల్లో 29 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్ కార్యదర్శి మల్లేశం, ద్వితీయ శ్రేణి కార్యదర్శి రాజా, అధికారులు విక్రయాలను పరిశీలించారు