హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'

KRNL: పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్‌గౌడ్ సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. అపరిచితుల కాల్స్, మెసేజ్‌లను నమ్మొద్దని, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని మంగళవారం సూచించారు. అనుమానాస్పద లింకులు తెరవకూడదన్నారు. మోసానికి గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని CI కోరారు.