హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాచల స్వామికి భారీ విరాళం

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య అన్నప్రసాద పథకానికి కూర్మన్నపాలెంకు చెందిన దాత భాస్కరం మంగళవారం రూ.1,00,016 విరాళంగా అందజేశారు. ఆలయ ప్రొటోకాల్‌ కార్యాలయంలో అధికారులకు నగదును అందించారు. దాతకు స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించి, అనంతరం శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు.