హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫైనల్‌కు శ్రీకాకుళం బాలికల జట్టు

SKLM: మహారాష్ట్రలో జరుగుతున్న 39వ సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాకుళం బాలికల జట్టు ఘన విజయం సాధించింది. సూపర్-4 పోరులో ప్రత్యర్థి మహారాష్ట్ర జట్టుపై 6-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా టైటిల్ పోరుకు అర్హత సాధించిన జట్టును సెక్రటరీ సూర శ్రీనివాస్, ఎంవీ రమణ తదితరులు అభినందించారు.