ELR: గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు హామీ ఇచ్చారు. కళాశాలలో భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనపై కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్యే ధర్మరాజు, కళాశాలకు అవసరమైన భవనాలు, వసతుల గురించి అరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ కళాశాల అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే


