హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే

NTR: నందిగామ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థుల సౌకర్యార్థం దాతల సహకారంతో సమకూర్చిన 40 మంచాలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంలో దాతలు అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని, వారి సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నెలవాలన్నారు.