హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందవరంలో వైసీపీ మండల స్థాయి సమావేశం

KRNL: నందవరం మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ మండల స్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. గ్రామాల్లో తాగు, సాగునీరు, రహదారులు, రైతుల సమస్యలపై చర్చించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని రాజీవ్‌రెడ్డి సూచించారు.