హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్చరిక బోర్డులు లేక వాహనదారుల ఆందోళన

ప్రకాశం: పెద్దదోర్నాలలో ఆత్మకూరు వెళ్లే రహదారిపై సిమెంట్ రోడ్లను పగలగొట్టి పనులు చేపడుతున్నారు. అయితే ప్రమాద సూచికలు,హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో రహదారి పరిస్థితి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.