NTR: కొండపల్లి మున్సిపాలిటీ 19వ వార్డులో రోడ్లు గుంతలమయంగా, డ్రైనేజీ లేక మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. వర్షానికి వీధులన్నీ చెరువులుగా మారి వాహనదారులు గాయాలపాలవుతున్నారు. దుర్వాసన, దోమల బెడదతో డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ప్రబలుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతల రోడ్లతో వాహనదారులకు కష్టాలు


