హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత షూటర్‌కు స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత షూటర్ నీరూ ధండా స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో రజతం సాధించిన భారత జట్టులో నీరూ ధండా సభ్యురాలిగా ఉంది. దీంతో ఒకే రోజు రెండు పతకాలు సాధించి ఆసియా క్రీడల్లో ప్రత్యేక ఘనతను సొంతం చేసుకుంది.