హైదరాబాద్: 28°C
క్రీడలు

50 పతకాల దిశగా భారత్‌

ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ 10వ రోజు పతకాల వేటను రజతంతో ప్రారంభించింది. మహిళల టీమ్ ట్రాప్ షూటింగ్‌లో నీరూ ధండా, అషిమ అహ్లావత్, మనీషా కీర్‌ల బృందం రజతం సాధించింది. దీంతో భారత్‌ 50 పతకాల (46) మార్క్‌కు మరింత చేరువైంది. మరోవైపు నీరూ ధాండా మహిళల వ్యక్తిగత షూటింగ్‌ విభాగంలో అదరగొట్టి ఫైనల్‌కు అర్హత సాధించింది.