హైదరాబాద్: 28°C
క్రీడలు

మహిళల షూటింగ్‌లో భారత్‌కు రజతం

ఆసియా క్రీడల్లో భారత మహిళల షూటింగ్ జట్టు రజత పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో నీరూ దండా, ఆషిమా అహ్లావత్, మనీషా కీర్‌లతో కూడిన భారత బృందం రెండో స్థానంలో నిలిచింది. అద్భుత ప్రదర్శనతో పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత షూటర్ల పతకాల ఖాతాలో మరో రజతం చేరింది.