MDK: సికింద్రాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి స్వామివారి వెండి ఆభరణాలు, పంచపాత్రలు, శతగోపం, అమ్మవారి బంగారు పుస్తెలు దొంగిలించారు. ఆలయ సిబ్బంది ధనుంజయ్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై సీహెచ్. మధుకర్ రెడ్డి కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నరసింహస్వామి ఆలయంలో చోరీ


