హైదరాబాద్: 28°C
క్రీడలు

షూటర్లను అభినందించిన ముర్ము

ఆసియా క్రీడల్లో మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించిన భారత షూటర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. నీరూ ధండా, ఆషిమా అహ్లావత్, మనీషా కీర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. వారి కచ్చితత్వం, ఏకాగ్రతతో ఈ విజయం సాధించారని ప్రశంసించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.