హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

KRNL: కర్నూలు నుంచి నంద్యాల మీదుగా మచిలీపట్నానికి రైలు నడపడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. మచిలీపట్నం నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శనివారం సాయంత్రం 4:55 గం" బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:45 గం" కర్నూలు చేరనుంది. కర్నూలు నుంచి ప్రతి మంగళవారం, గురువారం, ఆదివారం ఉదయం 9:30 గం" బయలుదేరి, రాత్రి 9:35 గం" మచిలీపట్నం చేరుతుంది. దీంతో మరో రైలు అందుబాటులోకి రానుంది.