హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లాలో జాబ్ మేళా

చిత్తూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 30న APSSEC ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉ.10 గంటల నుంచి జరగనున్న ఈ మేళాలో ఆరు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. SSC, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన 18 నుంచి 35 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చు. అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అలాట్‌మెంట్ ఆర్డర్‌తో రావాలని నిర్వాహకులు తెలిపారు.