హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో దారుణహత్య

పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణ హత్య కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దచెరువుకు చెందిన రాజేష్‌పై గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.