హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కారు ధ్వంసం

ATP: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనం ధ్వంసమైంది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన స్కార్పియో అద్దాలను పగులగొట్టినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. వాహనం ధ్వంసానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.