KDP: మైలవరం మండలం వేపరాల ZPHS ఆవరణలో ఇవాళ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఉదయం పాఠశాల వాచ్‌మెన్ మృతదేహాన్ని గుర్తించి స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో జ్యోతి మహోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో మృతుడు ఎవరు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని మృతదేహం కలకలం


