హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో సినీ నటి మెహ్రీన్ సందడి

కోనసీమ: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అమలాపురంలో 2కే వాక్‌థాన్ నిర్వహించారు. సినీనటి మెహ్రీన్ కౌర్ ముఖ్యఅతిథిగా పాల్గొని అభిమానులు, స్థానికులతో సందడిగా గడిపారు. ఎస్‌కేబీఆర్ కళాశాల నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు వాక్‌థాన్ సాగింది. గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించారు.