హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కష్టాల్లో టమాటా రైతులు!

CTR: వర్షాలు ముఖం చాటేయడంతో జిల్లాలో టమాటా రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారు. 64.5 శాతం లోటు వర్షపాతం నమోదవడంతో బోర్లు, బావులు అడుగంటాయి. మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం తదితర ప్రాంతాల్లో నీరందక తోటలు ఎండిపోతున్నాయి. ఎకరాకు రూ. లక్షకుపైగా పెట్టుబడి పెట్టినా మదనపల్లె మార్కెట్‌లో 15 కేజీల బాక్సుకు రూ.150 కూడా ధర పలకడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.