ప్రకాశం: వెంకటాద్రిపాలెం PHC పరిధిలోని అమ్మనిగుడిపాడు సబ్‌సెంటర్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సృజన ముఖ్య అతిథిగా హాజరై చిన్నారుల వ్యాక్సినేషన్, MCH, PNC రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. వైద్య సేవలపై సిబ్బందితో సమీక్షించి, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'వైద్య సేవలు మెరుగుపర్చాలని ఆదేశం'


