హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాధించాలి'

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీడీవో ఇమ్రాన్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో సూచించారు.