కొయ్యూరు మండలం బట్టుమెట్ట గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పర్యటించారు. ఆయన సమక్షంలో బీజేపీ, టీడీపీకి చెందిన 35 కుటుంబాలు వైసీపీలో చేరాయి. మాజీ వైస్ సర్పంచ్ డూరి రాజబాబు, వార్డు సభ్యుడు పండ చిట్టిబాబుతో పాటు పలువురికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరిక


