హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీఎం స్వనిధితో 6,517 మందికి రూ.12.95 కోట్ల రుణాలు

VSP: జీవీఎంసీ పరిధిలో పీఎం స్వనిధి పథకం ద్వారా ఇప్పటివరకు 6,517 మంది వీధి వ్యాపారులకు రూ.12.95 కోట్ల రుణాలు అందించినట్లు యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.వి. రమణ తెలిపారు. భీమిలి జోనల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పథకం కింద రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు దశలవారీగా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.