KRNL: ఎమ్మిగనూరు APUWJ ప్రతినిధులు ఎమ్మెల్యే డా.బీవీ జయ నాగేశ్వరరెడ్డిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రెస్‌క్లబ్ ఏర్పాటు, ఇళ్ల స్థలాల కేటాయింపు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి


