హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దయచేసి తప్పుడు ప్రచారం చేయవద్దు'

RR: మన్సూరాబాద్ గణేశ్‌నగర్‌లో రాజేశ్ అనే యువకుడి ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని మృతుడి తల్లి జయమ్మ, ఎరుకల సంఘం నాయకులు కోరారు. మృతిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వారు స్పందిస్తూ.. వాస్తవాలు తేలకముందే దయచేసి తప్పుడు ప్రచారం చేయవద్దని, దీనిని రాజకీయంగా వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.